విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి యూఏఈ శుభవార్త చెప్పింది. ఎలాంటి స్పాన్సర్ లేకపోయినా ఉద్యోగాల వేట కోసం యూఏఈకి వచ్చేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం సింగిల్ ఎంట్రీ వీసాలను అందించనుంది. 60, 90, 120 రోజుల కాలవ్యవధితో ఈ వీసాలను జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.