ఒపెక్ నుంచి యూఏఈ వైదొలగడం: భారత్‌కు సానుకూలమా?

అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముడిచమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వైదొలగనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో, గురువారం న్యూఢిల్లీలో జరిగిన ‘ది ఎకనామిస్ట్ ఇంపాక్ట్ రెసిలెంట్ ఫ్యూచర్స్ సమ్మిట్’లో అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ మాట్లాడుతూ, గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్‌కు ఇది సానుకూల పరిణామంగా మారే అవకాశం ఉందని తెలిపారు. యూఏఈ నిర్ణయం చమురు ధరలపై ఒపెక్ పట్టును బలహీనపరిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్