ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. నీటి మట్టం రికార్డు స్థాయి 207.41 మీటర్లకు చేరుకుంది. దీంతో యమునా బజార్, గీతా కాలనీ, కశ్మీరీ గేట్, మయూర్ విహార్ ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటివరకు 14 వేల మందికి పైగా ప్రజలను తరలించారు. వజీరాబాద్, హథినీకుండ్ బ్యారేజీల నుంచి వరద విడుదల కారణంగా నీటిమట్టం మరింత పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించగా, ఓల్డ్ ఢిల్లీ వంతెన, నిగంబోధ్ ఘాట్ కార్యకలాపాలు నిలిపివేశారు.