రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. తాజాగా, ఉక్రెయిన్ 1600 డ్రోన్లతో రష్యాపై దాడి చేసింది. ఇందులో 450 డ్రోన్లు మాస్కోను లక్ష్యంగా చేసుకున్నాయని మాస్కో మేయర్ సెర్గీ తెలిపారు. ఈ దాడుల్లో ఆయిల్ రిఫైనరీలు, అపార్ట్మెంట్లు ధ్వంసమై భారీ ఆస్తి నష్టం సంభవించింది. ముగ్గురు మరణించినట్లు సమాచారం. మరోవైపు, రష్యా దాడిలో ముగ్గురు పిల్లలతో సహా నలుగురు మరణించారని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు భయానకంగా ఉన్నాయి.