ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం పరిధిలోని సైట్స్ సంస్థ, రిలయన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న వంతారా సంస్థలు జంతు సంరక్షణలో చూపుతున్న నిబద్ధతను ప్రశంసించింది. ఇటీవల విడుదల చేసిన నివేదికలో, వంతారా కాంప్లెక్స్‌లోని గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్, రాధా కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ వంటి కేంద్రాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనిచేస్తున్నాయని పేర్కొంది. వంతారా సౌకర్యాలు, పశువైద్య సేవలు, అధునాతన వైద్య పద్ధతులు అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలుస్తాయని తెలిపింది.