కుటుంబ సభ్యుల చేతిలోనే మహిళల హత్యలు: ఐరాస నివేదిక

ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింస కొనసాగుతోందని, 2024లో ప్రతి 10 ని. లకు ఒక మహిళ తనకు తెలిసిన వ్యక్తుల చేతిలో హత్యకు గురైనట్లు ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. UNODC, UN Women సంయుక్తంగా విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం, గతేడాది 50 వేల మంది మహిళలు, బాలికలు భర్తలు, ప్రేమికులు, తండ్రులు, అన్నలు, ఇతర బంధువుల చేతిలోనే ప్రాణాలు కోల్పోయారని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా మహిళల హత్యల్లో సగానికి పైగా కుటుంబ సభ్యుల పాత్ర ఉందని వెల్లడించింది. ఆఫ్రికాలో అత్యధికంగా ఉన్నట్లు  వివరించింది.

సంబంధిత పోస్ట్