భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య

TG: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం పరిధిలోని ఆరుట్ల గ్రామంలో జోగు సంధ్య అనే వివాహిత గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. భర్త సుదర్శన్ వేధింపులే ఆమె కారణమని సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుదర్శన్, సంధ్య దంపతులు. సుదర్శన్ ఆటో నడుపుతుండగా, సంధ్య గ్రామంలో కిరాణా దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తుంది. సుదర్శన్ రోజు తాగి రావడంతో వీరి మధ్య గొడవలు జరుగుతుండేవీ. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్