యూపీలోని సంభల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జునాబై పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లియా గ్రామానికి చెందిన ఓ అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు ఆమెను వేధించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వేధింపులతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు.