TG: కాంగ్రెస్‌కు యువతే అసలైన శక్తి అని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యూత్ కాంగ్రెస్ నేతలు ప్రజా సమస్యలపై పోరాడాలని, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందని, రాబోయే రోజుల్లో పార్టీ, అధికారిక పదవుల్లో యువతకు సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు.