కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కులదూషణ కేసులో అరెస్టు అవుతానన్న భయంతో బుధవారం మెహబూబ్ (22) అనే యువకుడు ఆత్మహత్య చేసుకోగా, అతని మరణవార్త విన్న తండ్రి సయ్యద్ గుండెపోటుతో మరణించాడు. వడగెరాలో పొలానికి దారి విడిచే విషయంలో మెహబూబ్ పొరుగున ఉంటున్న వ్యక్తిని దూషించాడు. ఇదే విషయమై స్థానిక పెద్దలు పంచాయతీ చేసి రాజీ చేసినా, తనపై పోలీసు కేసు పెట్టడంతో మెహబూబ్ మనోవేదనకు లోనై ఆత్మహత్య చేసుకున్నాడు.