TG: అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల(D) నెన్నెల(M) గొల్లపల్లికి చెందిన మమత (29), తాండూరు(M) చంద్రపల్లికి చెందిన కంబాల నరేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే వీరు గోదావరిఖనిలోని గంగానగర్ లో అద్దె ఇంటిలోకి మారారు. అయితే భర్త నరేష్, అత్తమామలు కట్నం కోసం మమతను వేధింపులకు గురి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మమత పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.