TG: సిద్ధిపేట(D) దుబ్బాక(M)లోని తిమ్మాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల(D) ఇల్లంతకుంట(M) పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన పెద్దోళ్ల సుష్మ(32)ను కొన్నేళ్ల క్రితం శ్రీకాంత్ కు ఇచ్చి వివాహం చేశారు. కొంత కాలంగా భర్త, అత్తామామల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో శనివారం సుష్మ ఇంట్లో ఉరి వేసుకుంది. తమ కుమార్తె మృతికి అల్లుడు, అత్తమామలే కారణమని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.