TG: హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఇంటర్ సెకండియర్ విద్యార్థి దీక్షిత్‌రాజ్ (17) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు ఉండటంతో దీక్షిత్‌రాజ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.