AP: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల్ని విడిచి ఉండలేక ఓ విద్యార్థిని జడ రిబ్బన్‌తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. లావణ్య అనే బాలిక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. ఇటీవల దసరాకు ఇంటికి వెళ్లిన బాలికను పేరెంట్స్ గురువారం హాస్టల్‌కు పంపించారు. దీంతో తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక స్కూల్ కు వెళ్లిన రోజే ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.