అల్లుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మామ!

AP: తిరుపతి జిల్లా వెంకటగిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాపన హరిప్రసాద్ (32), మౌనిక దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మౌనిక తన పుట్టింటికి వెళ్లింది. ఆమెను తీసుకురావడానికి హరిప్రసాద్ అత్తారింటికి వెళ్లాడు. ఈ క్రమంలో మామతో హరిప్రసాద్ వాగ్వాదానికి దిగాడు. కోపంతో రగిలిపోయిన మామ.. అల్లుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో అల్లుడి శరీరం 70శాతం కాలిపోయింది. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్