తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే పసిపిల్లలకు గ్రాము బరువున్న బంగారు ఉంగరం అందించే ‘మేనమామ బంగారు ఉంగరం’ పథకాన్ని ఈ నెల 28న మదురై రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. తొలుత ఉసిలంపట్టిలో ప్రారంభించాలని భావించినా భద్రతా కారణాలతో వేదిక మార్చారు. CM విజయ్ 50 మంది పసిపిల్లలకు ఉంగరాలు పంపిణీ చేయనున్నారు. ఈ పథకం ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జన్మించిన శిశువులకు వర్తించనుంది.