అండర్-19 ప్రపంచకప్.. నేడే భారత్-అఫ్గాన్ సెమీఫైనల్ పోరు

అండర్-19 ప్రపంచకప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత యువ జట్టు నేడు జరిగే రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్‌తో తలపడుతుంది. ఐదు టైటిళ్లతో అత్యంత విజయవంతమైన జట్టుగా నిరూపించుకున్న భారత్, ఈ ఏడాదిని కూడా తమ ఖాతాలో చేర్చుకోవాలని ఆశిస్తోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ తిరుగులేని విజయాలు సాధించిన భారత్‌ను అడ్డుకోవడం అఫ్గాన్‌కు కష్టమే. అయితే ఈ టోర్నీలో అఫ్గానిస్తాన్ కూడా బాగా ఆడింది. తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో శుక్రవారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్ తలపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్