అండర్-19 ప్రపంచ కప్: ఫైనల్ కి చేరుకున్న భారత్

ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్‌లో భారత జట్టు విజయయాత్ర కొనసాగుతోంది. బుధవారం జరిగిన సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. 311 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసి భారత్ కొత్త రికార్డు సృష్టించింది. ఆరోన్ జార్జ్ 95 బంతుల్లో 115 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ 68, ఆయుష్ మాత్రి 62 పరుగులు చేశారు. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ 310/4 పరుగులు చేసింది. ఫైనల్లో భారత్ ఇంగ్లాండ్‌తో తలపడనుంది.

సంబంధిత పోస్ట్