జగిత్యాల రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బుధవారం వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్.. గురువారం కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. మరోవైపు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఈ పరిణామాలతో జగిత్యాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య గందరగోళం నెలకొంది. స్థానిక రాజకీయాల్లో ఈ పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.