వచ్చే ఏడాది స్కూళ్లు తెరిచే రోజే యూనిఫాం: సీఎం

TG: విద్యార్థుల యూనిఫాంపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆకర్షణీయమైన రంగుల్లో యూనిఫాం రూపొందించాలని చెప్పారు. వచ్చే ఏడాది స్కూళ్లు తెరిచే రోజే యూనిఫాం అందేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలకు ఒక జత యూనిఫాం పంపిణీ చేశామని విద్యాశాఖ అధికారులు సీఎం రేవంత్‌కు తెలిపారు. రెండో జతను ఈ నెలాఖరులోగా అందజేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕