తాను కేంద్రబడ్జెట్‌లో ప్రవేశబెట్టిన కొత్త పన్ను విధానంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో కోటి మందికి పైగా ప్రజలకు పన్ను భారం నుంచి ఊరట లభిస్తుందని వెల్లడించారు. పన్ను శ్లాబుల సవరణలతో ప్రజల చేతుల్లో సరిపడా డబ్బులు ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో రూ.8లక్షల ఆదాయం ఉన్నవారు రూ.30వేలు పన్ను కట్టేవారని గుర్తుచేశారు.