TG: ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఢిల్లీ పోలీస్ కమిషనర్, కలెక్టర్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితిపై ఆరా తీశారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్లేరి వెళ్లనున్నారు. పేలుడు ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రిలో పరామర్శించనున్నారు. అనంతరం ఎర్రకోట వద్దకు వెళ్లి పరిశీలించనున్నారు. ఈ పేలుడు ధాటికి 13 మంది మృతి చెందగా.. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.