కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది తక్కువ వర్షాలు కురుస్తాయని ప్రపంచం ఆందోళన చెందుతోందని, జూన్‌లో రావాల్సిన వర్షాలు 40, 50 శాతం నమోదయ్యాయని తెలిపారు. మన దేశంలో వర్షాలు కురిస్తేనే ప్రజల అవసరాలు తీరుతాయని, ఈ ఏడాది అన్ని దేశాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. ప్రతి నీటి చుక్క కూడా పొదుపు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.