అకాల వర్షం.. రైతులకు తీవ్ర నష్టం (వీడియో)

TG: సంగారెడ్డి జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కంది, ఆందోల్, చౌటకూర్, పుల్కల్, వట్‌పల్లి, హత్నూర తదితర మండలాల్లో రోడ్లపై, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. వర్షపు నీటికి వడ్లు కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 20 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయకపోవడమే తమ నష్టాలకు కారణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕