ఆధార్‌ కార్డులో మెయిల్ ఐడీ అప్‌డేట్‌.. డిసెంబర్‌ 31 వరకు ఛాన్స్!

ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. ఎలాంటి ఛార్జ్ లేకుండా ఆధార్ కార్డుకు జీమెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఇది 2026 DEC 31 వరకు అందుబాటులో ఉంటుంది. సాధారణంగా ఈ సేవకు రూ.75 ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం దానిని రద్దు చేశారు. అధికారిక ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే OTPతో లాగిన్ కావాలి. ఆ తర్వాత ఈమెయిల్ యాడ్ లేదా అప్‌డేట్ ఎంచుకుని జీమెయిల్ వివరాలను సబ్మిట్ చేయాలి. సుమారు 15 రోజుల్లో మెయిల్ ఐడీ అప్‌డేట్ అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్