ఇప్పుడు అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా UPI ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ICICI ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, బజాజ్ ఫిన్సర్వ్ AMC ఈ సేవను క్యూరీ మనీతో కలిసి “Pay with Mutual Fund” ఫీచర్‌ను ప్రారంభించాయి. దీని ద్వారా లిక్విడ్ ఫండ్‌లో పెట్టిన డబ్బును నేరుగా UPI పేమెంట్స్‌కి ఉపయోగించవచ్చు. దీనికి ముందుగా బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ కూడా అవసరం లేదు. 7% వరకు రాబడితో కూడిన ఈ ఫీచర్ సులభ, తక్షణ లిక్విడిటీ, షార్ట్-టర్మ్ డబ్బు నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది.