యూపీఐ సేవల్లో అంతరాయం.. ఎస్‌బీఐ నిర్వహణ పనుల పొడిగింపు

యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌లో బుధవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎస్‌బీఐ సేవల్లో సమస్య ఎక్కువగా కనిపించింది. డౌన్‌డిటెక్టర్ ప్రకారం, ఎస్‌బీఐ ఖాతాదారుల నుంచి 500కు పైగా, యూకో బ్యాంకుకు సంబంధించి 40 ఫిర్యాదులు వచ్చాయి. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలతో పాటు పలు ప్రాంతాల నుంచి వినియోగదారులు లావాదేవీలు విఫలమయ్యాయని ఫిర్యాదు చేశారు. ఎస్‌బీఐ స్పందిస్తూ, షెడ్యూల్ ప్రకారం చేపట్టిన నిర్వహణ పనుల సమయాన్ని ఏప్రిల్ 1వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటల వరకు పొడిగించినట్లు, ఈ సమయంలో యూపీఐ, ఐఎంపీఎస్, యోనో, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ సేవల్లో అంతరాయం కలుగవచ్చని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్