గ్రీస్‌లో యూపీఐ సేవలు ప్రారంభం

భారత యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) సేవలు తాజాగా గ్రీస్‌లోని ఏథెన్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పర్యటన సందర్భంగా యూరోబ్యాంక్‌- ఎన్‌ఐపీఎల్‌ భాగస్వామ్యంతో ఈ సేవలు ప్రారంభించారు. దీని ద్వారా వినియోగదారులు తక్కువ ఖర్చుతో వేగంగా, సురక్షితంగా డబ్బు బదిలీ చేసుకోవచ్చని గోయల్ తెలిపారు. ఇటీవల ఫ్రాన్స్‌లోనూ యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్‌, మారిషన్‌, నేపాల్‌, భూటన్‌, ఖతార్‌, శ్రీలంక, కంబోడియాతో సహా మొత్తం 10 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

సంబంధిత పోస్ట్