కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ను యూపీఎస్సీ వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రేపు విడుదల కావాల్సిన నోటిఫికేషన్, అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల వాయిదా పడింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని యూపీఎస్సీ తెలిపింది. గతంలో మే 24న ప్రిలిమ్స్, ఆగస్టు 21న మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది.