తల్లిపాలలో యురేనియం: బిహార్‌లో పరిశోధన

బిహార్‌లో జరిగిన పరిశోధనలో 40 మంది బాలింతల తల్లిపాలలో యురేనియం (U-238) ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.  ఈ యురేనియం స్థాయిలు తక్కువగా ఉన్నప్పటికీ, శిశువులు దీర్ఘకాలంలో క్యాన్సరేతర సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. అయితే, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారి ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అధ్యయనంలో పేర్కొన్న యురేనియం నమూనాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించదగిన పరిమితి కంటే తక్కువగానే ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్