గత ఏడాది రష్యా, వెనెజువెలా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటుందనే కారణంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై సుంకాలు పెంచారు. తాజాగా, రష్యా చమురుకు బదులుగా వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇస్తామని ట్రంప్ యంత్రాంగం భారత్‌కు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించుకుంటామని భారత్ చెప్పడంతో, రాబోయే రోజుల్లో రష్యా నుంచి దిగుమతులు కొన్ని లక్షల బ్యారెళ్ల మేర తగ్గుతాయని అంచనా.