వెనెజువెలాలో సంభవించిన భూకంపంలో వందల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. భూకంపం వచ్చిన ముందురోజే 100 మంది వెనెజువెలా వాసులు అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యారు. వీరంతా స్వదేశానికి చేరుకొని ఓ హోటల్‌లో ఆశ్రయం పొందారు. ఆ రాత్రే భూకంపం రావడంతో వారు బస చేసిన హోటల్ కూలిపోయింది. దీంతో అమెరికా నుంచి వచ్చిన 100 మంది ఈ ఘటనలో మరణించారు.