అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం 179 ఏళ్ల వెయిటింగ్

అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు షాకింగ్ రిపోర్ట్. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ నివేదిక ప్రకారం, ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ క్యూలో ఉన్నవారిలో 79% భారతీయులే. EB-2 కేటగిరీలో కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు 179 ఏళ్లు, EB-3 కేటగిరీలో 38 ఏళ్లు వేచి ఉండాల్సి వస్తుందని అంచనా. 1990 నాటి చట్టపరమైన పరిమితులే దీనికి ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం వీసా కోటాలు పెంచాలని, దేశాలవారీ నిబంధనలను తొలగించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕