ట్రంప్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. అమెరికా వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు పెంచింది. హెచ్-1బీ, ఎల్-1, ఒ-1 వీసాల ఫీజులను 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు అగ్రరాజ్యం పెంచింది. మిగతా వీసా కేటగిరీల ప్రాసెసింగ్ ఫీజుల్లోనూ మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపింది. ఈ కొత్త ఫీజులు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.