అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో జెనీవా వేదికగా ఆదివారం ఈ ఒప్పందం జరగవచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ ముసాయిదా ప్రకారం, ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసి, బిలియన్ల డాలర్ల నిధులను విడుదల చేయడంతో పాటు, లెబనాన్‌తో సహా అన్ని రంగాలలో శత్రుత్వానికి విరామం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అణు సమస్యలపై చర్చలు తర్వాత జరుగుతాయని ఒక సీనియర్ ఇరాన్ అధికారి రాయిటర్స్‌కు తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖాలిబాఫ్ సంతకాలు చేయనున్నట్లు సమాచారం.