ఇరాన్ దెబ్బకు అమెరికాకు బిలియన్ డాలర్ల నష్టం

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం అమెరికాకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని యూఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయడంతో విస్తృత నష్టం వాటిల్లినట్లు సమాచారం. యూఏఈ, కువైట్, బహ్రైయిన్, సౌదీ అరేబియా, ఖతార్‌లోని అమెరికా బేస్‌లపై జరిగిన దాడుల్లో రన్‌వేలు, రాడార్ వ్యవస్థలు, ఆయుధ గిడ్డంగులు, కమాండ్ సెంటర్లు దెబ్బతిన్నాయని తెలుస్తోంది. వీటి మరమ్మతులకు అమెరికాకు బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే మొత్తం నష్టం వివరాలను US డిఫెన్స్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్