గాజాలో కాల్పుల విరమణ ప్రణాళిక అమలుకు ఆటంకాలు కొనసాగుతున్న వేళ.. పునర్నిర్మాణం, పరిపాలన ప్రారంభించేందుకు అమెరికా మద్దతుగల ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఆరు నెలల కార్యాచరణ కోసం 2.45 బిలియన్ డాలర్ల ప్రణాళికను ప్రతిపాదించింది. ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా న్యూయార్క్‌లో బోర్డు సమావేశమైంది. గాజాలో పునర్నిర్మాణానికి 66 ప్రాజెక్టుల బ్లూప్రింట్‌ను ఆవిష్కరించింది. మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. దెబ్బతిన్న మౌలిక వసతుల పునర్నిర్మాణానికి 35.2 బిలియన్ డాలర్లు, తదుపరి పదేళ్లలో మరో 71.4 బిలియన్ డాలర్లు అవసరమని బోర్డు అంచనా వేసింది.