తీవ్ర వరదలతో అతలాకుతలమైన నేపాల్‌ను ఆదుకునేందుకు అమెరికా ప్రభుత్వం 31 మిలియన్ డాలర్ల (రూ.296 కోట్లకు పైగా) ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత వంతెనల నిర్మాణం, బాధితుల సంక్షేమం, భవిష్యత్తులో విపత్తులను ఎదుర్కొనేందుకు డ్రోన్ల పంపిణీ నిమిత్తం ఈ నిధులను కేటాయించనున్నట్లు వెల్లడించింది. న్యూయార్క్‌లో నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్తో అమెరికా రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీ అల్లిసన్ హుకర్ సమావేశమయ్యారు. ఈ భేటీలోనే ఆమె ఈ సహాయాన్ని అధికారికంగా ప్రకటించారు.