ఇరాన్‌ షాడో ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకొన్న అమెరికా

అమెరికా ఆంక్షలను ధిక్కరిస్తూ ఇరాన్ ముడిచమురును అక్రమంగా రవాణా చేస్తున్న 'స్కైవేవ్' అనే షాడో ఫ్లీట్ చమురు ట్యాంకర్‌ను అమెరికా బలగాలు హిందూ మహాసముద్రంలో స్వాధీనం చేసుకున్నాయి. ఈ నౌక సుమారు 10 లక్షల బారెల్స్ ముడిచమురును తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మార్చి నెలలోనే అమెరికా ఈ నౌకపై ఆంక్షలు విధించింది. ఫిబ్రవరిలో ఇరాన్‌కు చెందిన ఖర్గ్ ద్వీపం నుంచి ఈ ట్యాంకర్ మిలియన్ బారెల్స్‌కు పైగా ముడిచమురును లోడ్ చేసుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

సంబంధిత పోస్ట్