ఉక్రెయిన్ గగనతల రక్షణను బలోపేతం చేసేందుకు అమెరికా భారీ ఆయుధ సాయం ప్రకటించింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 850 మిలియన్ డాలర్ల విలువైన 3,350కి పైగా ఈఆర్‌ఏఎమ్ క్షిపణుల పంపిణీకి ఆమోదం తెలిపారు. యూరోపియన్ దేశాలు నిధులు సమకూర్చగా, ఆరు వారాల్లో ఇవి కీవ్‌కు చేరనున్నాయి. 240-450 కి.మీ. పరిధి కలిగిన ఈ క్షిపణులు ముందే పంపవలసి ఉన్నప్పటికీ పుతిన్-జెలెన్‌స్కీ చర్చల కారణంగా ఆలస్యం జరిగింది.