వంట నూనె అధికంగా వాడటం వల్ల గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు 25-30 మి.లీ (2 టేబుల్ స్పూన్లు) నూనె మాత్రమే తీసుకోవాలని, ఇది వారానికి 150-170 మి.లీకి సమానం అని వైద్యులు సూచించారు. ఆలివ్ నూనె, వేరుశెనగ నూనె, పొద్దుతిరుగుడు నూనె, ఆవ నూనె వంటివి గుండె ఆరోగ్యానికి మంచివని, అయితే రిఫైన్డ్ కాకుండా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడాలన్నారు.