భారత్‌కు యూఎన్‌ఎస్‌సీలో శాశ్వత సభ్యత్వం

న్యూయార్క్‌లో జరిగిన తొలి వీ4-భారత్ భేటీలో ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు పోలాండ్, హంగరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ మద్దతు ప్రకటించాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వీ4 దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. రాజకీయ, ఆర్థిక, సాంకేతిక, రక్షణ, సాంస్కృతిక రంగాల్లో సహకారం పెంచుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ వివాదం, గల్ఫ్ ప్రాంత పరిణామాలు వంటి అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕