ఒకప్పుడు తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు వడ్డే నవీన్, దాదాపు దశాబ్దం తర్వాత హీరోగా, నిర్మాతగా నటించిన 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' సినిమా గత నెల 19న థియేటర్లలో విడుదలైంది. అయితే, పాత కథ, సీరియల్ తరహా ట్రీట్‌మెంట్ కారణంగా నెగటివ్ టాక్ రావడంతో, ఈ చిత్రం ఈ నెల 17వ తేదీ నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.