ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్‌లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగ్రేటం చేయకపోవడంపై భారత సహాయ కోచ్ ర్యాన్ టెన్ డోస్కేట్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిగతా ఆటగాళ్లలాగే వైభవ్ కూడా అవకాశాల కోసం వేచి ఉండాల్సి వస్తుందని, సీనియర్ ఆటగాళ్లను వెంటనే తప్పించలేమని ఆయన తెలిపారు. సంజు శాంసన్‌ను తొలగించి వైభవ్‌కు అవకాశం ఇవ్వాలన్న వాదనలపై స్పందిస్తూ, శాంసన్ టీ20 వరల్డ్ కప్‌లో కీలక పాత్ర పోషించాడని గుర్తు చేశారు. ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం కల్పించడం ముఖ్యమని, వైభవ్ కూడా జట్టులో అవకాశం కోసం ఇతర ఆటగాళ్ల మాదిరిగానే వేచి చూడాలని ఆయన కుండబద్దలు కొట్టారు.