నిన్నటి ఐపీఎల్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను అలరించాడు. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్లు, 5 ఫోర్లతో 97 పరుగులు చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఈ ఇన్నింగ్స్‌పై IPL ప్రత్యేక వీడియోను విడుదల చేస్తూ “97 seconds of 97” అంటూ హైలైట్స్‌ను షేర్ చేసింది. సెంచరీకి చేరువలో ఉన్నప్పటికీ నెమ్మదిగా ఆడకుండా జట్టు కోసం భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. కానీ, వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.