భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్ శనివారం (జులై 4) నాడు జరగనుంది. ఈ నేపథ్యంలో అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై ఆడిన ఇన్నింగ్స్ ఫోటోలను వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియాలో పంచుకోవడంతో.. 15 ఏళ్ల వైభవ్ రెండో టీ20లో ఆడతాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ వైభవ్ ఆడితే.. తిలక్ వర్మ లేదా సంజు శాంసన్‌లలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. అయితే, కొందరు వైభవ్ ఈ టోర్నమెంట్‌లో ఆడడం కష్టమని భావిస్తున్నారు. వరల్డ్ కప్ హీరోలతోనే గంభీర్ ముందుకు వెళ్తున్నారని అంటున్నారు.