తృటిలో అరుదైన రికార్డు కోల్పోయిన వైభవ్ సూర్యవంశీ

అండర్-19 వరల్డ్ కప్‌లో యువ భారత్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్‌లో అరుదైన రికార్డును తృటిలో కోల్పోయాడు. ఈ టోర్నమెంట్‌లో సెమీఫైనల్ ముందు వరకు 196 పరుగులు చేసిన వైభవ్, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 68 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో అండర్-19 వన్డేల్లో యాక్టివ్ ప్లేయర్‌లలో నంబర్ వన్ ఆల్ టైమ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచే అవకాశం, అలాగే పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజమ్ అండర్-19 వన్డే రికార్డును బద్దలు కొట్టే అవకాశం చేజారింది. ప్రస్తుతం అండర్-19 వన్డేల్లో యాక్టివ్ ఆటగాళ్లలో బంగ్లాదేశ్‌కు చెందిన అజీజుల్ హకీం అగ్రస్థానంలో ఉన్నాడు. వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం 23 మ్యాచ్‌లలో 1169 పరుగులు చేసి, యాక్టివ్ ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్