వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. 42 బంతుల్లోనే 144 పరుగులు (వీడియో)

ఏసీసీ రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌లో భారత్‌-ఏ జట్టు శుభారంభం చేసింది. యూఏఈతో జరిగిన టీ20లో వైభవ్‌ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్‌తో భారత్‌ భారీ స్కోరు సాధించింది. కేవలం 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్సర్లతో 144 పరుగులు బాదిన వైభవ్‌ ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేశాడు. వైభవ్‌ ధాటికి యూఏఈ లక్ష్యం చేరుకోలేకపోయింది. చివరికి భారత్‌-ఏ 148 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ప్రభంజనం సృష్టించింది. Video From: Sony Sports Network

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్