తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠ దర్శనాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ, మొత్తం 182 గంటల దర్శనాల్లో 164 గంటలు వారికి కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ పాలక మండలి మీడియా సమావేశంలో వెల్లడించింది.