ముగిసిన వల్లభనేని వంశీ 3 రోజుల కస్టడీ

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మూడు రోజుల కస్టడీ గురువారం ముగిసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. కృష్ణలంక PS లోని వంశీని పోలీసులు విచారించారు. ఇవాళ విచారణ ముగిసిన అనంతరం వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. కాసేపట్లో ఆయనను జైలుకు తరలించనున్నారు.

సంబంధిత పోస్ట్